Mar 5, 2018

రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నాం



బిజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ
         సచివాలయం, మార్చి 5: రాష్ట్రాభివృద్ధిని తాము కోరుకుంటున్నట్లు బిజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం వారు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. సభలో జరిగే చర్చలో రాష్ట్రాభివృద్ధికి బీజేపీ చేసిందేమిటో వివరిస్తామని చెప్పారు. విభజన హామీలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తమకు అపారమైన గౌరవం ఉందని, అయితే ఎవరో ఆయనకు తప్పుడు సలహాలు ఇస్తున్నారన్నారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...