Sep 20, 2026

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు




నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు.  మంగళగిరి నుంచి నేను  సైకిల్ వేసుకుని ఆ కార్యక్రమానికి వెళ్లాను. నాగార్జున యూనివర్శిటీ ప్రారంభోత్సవాన్ని కళ్లారా చూశాను. ఆనందించాను. ఎంతో ఉత్సాహంగా అదే ఊపుతో సైకిల్ తొక్కుకుంటూ మంగళగిరి వచ్చాను. గత 11న  స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) వేడుకలను ఘనంగా నిర్వహించారు.   యూనివర్సిటీ ప్రారంభమైన సరిగ్గా పది సంవత్సరాల తరువాత 1986లో అదే యూనివర్శిటీ  కేంపస్‌లో నేను లా విద్యార్థిగా చేరాను. నేను లాలో చేరి 40 ఏళ్లు అయింది. ఈరోజు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లా విద్యార్థుల అల్యూమ్ని సమావేశం జరిగింది. అప్పటి నా క్లాస్ మేట్స్  దిగ్విజయ అకాడమీ ఆఫ్ జస్టిస్ డైరెక్టర్  కృష్ణ, గుంటూరులో  అడ్వకేట్  వెంకటేశ్వరరావు మాత్రమే కలిశారు. అప్పటి మా లెక్చరర్స్ హరగోపాల్, రంగయ్య గారు మాత్రమే హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు ప్రసంగించారు.  హరగోపాల్ గారు ఈరోజు కూడా క్లాస్ చెప్పారు. చాలా కేసులు వివరించారు. 





No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...