2014 జూన్ 2: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారింది.
2014 సెప్టెంబరు 1: గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేశారు.
2014 సెప్టెంబరు 3: గ్రీన్ ఫీల్డ్ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది.
2014 డిసెంబరు 8: రాజధానిపై మాస్టర్ ప్లాన్ తయారీకి సింగపూర్ సంస్థలతో ఒప్పందం.
2014 డిసెంబరు 30: సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.
2015 జనవరి: రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభమైంది.
2015 మార్చి: 29 గ్రామాల్లో సుమారు 33 వేల ఎకరాల సమీకరణకు రైతుల అంగీకారం లభించింది.
2015 ఏప్రిల్ 23: రాజధాని నగరానికి అధికారికంగా అమరావతి పేరు పెట్టారు.
2015 జూలై 20: రాజధాని మాస్టర్ ప్లాన్లను సింగపూర్ బృందం ప్రభుత్వానికి అందజేసింది.
2015 అక్టోబరు 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చారు.
2016 ఫిబ్రవరి: మాస్టర్ డెవల్‌పమెంట్ ప్లాన్ నోటిఫై చేశారు.
2016 జూన్: ఏపీ సచివాలయం, ప్రభుత్వ విభాగాలు అమరావతి ప్రాంతం నుంచి పనిచేయడం ప్రారంభం.
2018 డిసెంబరు: సచివాలయ టవర్స్‌కు శంకుస్థాపన.
2019 ఫిబ్రవరి: హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన.
2019 మే: వైసీపీ ప్రభుత్వంలో అమరావతిపై కుట్రలు ప్రారంభం.
2019 డిసెంబరు 17: వైసీపీ మూడు రాజధానుల ప్రకటన
2020 జూలై 31: సీఆర్‌డీఏ చట్టం రద్దు చేశారు. మూడు రాజధానుల బిల్లు పెట్టారు. శాసనమండలిలో టీడీపీ వ్యతిరేకించింది. అప్పటి మండలి చైర్మన్ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు.
2021 డిసెంబరు 13: న్యాయ వివాదాలతో మూడు రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం పునరుద్ధరణ.
2022 మార్చి 5: అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు.
2024 జూన్ 2: పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. హైదరాబాద్ తెలంగాణకు పరిమితమైంది.
2025 మే 2: ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభించారు.
2026 మార్చి 28: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
2026 ఏప్రిల్ 1: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్‌విభజన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
2026 ఏప్రిల్ 2: సదరు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.



No comments:
Post a Comment