Apr 30, 2026

వ్యర్థాల పునర్వినియోగంలో అగ్రస్థానాన నిలవాలన్నదే ఏపీ లక్ష్యం

 

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తుండటంతో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.  సరైన నిర్వహణ లేకండా ఈ వ్యర్థాలను ఇలా వదిలివేస్తే, భవిష్యత్తులో వీటిని ధ్వంసం చేయడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది. అంతే కాకుండా, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా ప్రమాదకరం.  ఈ సమస్యని పరిష్కరించడానికి పారిశ్రామిక వ్యర్థాలను ఆర్థిక ఉత్పాదకంగా, పర్యావరణానికి హాని కలుగకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో  సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ‘వాడి, విసిరిపారేసే’ విధానం నుంచి ‘వాడిన తర్వాత  పునరుద్ధరణ, పునర్వినియోగం’ వ్యవస్థకు మారడం దీని ప్రధాన లక్ష్యంఅంటేవ్యర్థాల నుండి సంపద సృష్టించడం.  దీనినే ప్రపంచవ్యాప్తంగా సర్కిల్ ఎకానమీ(వృత్తాకార ఆర్థిక వ్యవస్థ-సీఈ) అంటారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు  ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఎకానమీ, వ్యర్థాల పునర్వినియోగం విధానం (4.0) (2025-30) అనే  కొత్త పాలసీ ప్రకటించింది. దీనికి సంబంధించి, గత సంవత్సరం ఆగస్టు 24న ఓ జీఓ జారీ చేసింది. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చడంరీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది.  వ్యర్థాల నిర్వహణలో వినూత్న విధానాలు అవలంబిస్తోంది. వ్యర్థాల నుండి ఆదాయం సృష్టించడంవ్యవసాయపారిశ్రామిక వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటురీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడంఉపాధి అవకాశాలు పెంచడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ పునరావృత ప్రక్రియ సాంకేతిక పురోగతులుమార్కెట్ మార్పులు, కార్యాచరణ అభిప్రాయాలకు అనుగుణంగా విధానాన్నిరూపొందిస్తారు. ఏపీఐఐసీఏపీపీసీబీస్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలతోపాటు సంస్థలన్నింటిని సమన్వయం చేసుకుంటూ,  పరిశ్రమల సంచాలకులు   అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సూక్ష్మచిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్లు, ఎలక్ట్రానిక్, ఆహారం, దుస్తులు, ఔషధాల పరిశ్రమల కోసం ప్రత్యేక పార్కులు రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే, అధిక వనరులను వినియోగించే థర్మల్ పవర్, మెటలర్జీ, నిర్మాణం, వ్యవసాయ ప్రాసెసింగ్, ప్యాకేజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల ద్వారా ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.  ఈ రంగాల ద్వారా ఫ్లై యాష్, ఎర్ర మట్టి నుండి రాళ్ల దుమ్మ పేపర్ వేస్ట్ప్లా స్టిక్ స్క్రాప్, బయోమాస్ అవశేషాల వరకు భారీ స్థాయిలో పారిశ్రామిక వ్యర్థాలు పోగుపడుతుంటాయి. సర్క్యులర్ ఎకానమీ సూత్రాల ద్వారాఈ వ్యర్థ ప్రవాహాలను పారిశ్రామిక విలువ గొలుసులు(ఇండస్ట్రియల్ వాల్యూచైన్స్)గా తిరిగి విలీనం చేయడంతోపాటు ముడి వనరుల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, కొత్త గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్‌లను సృష్టించవచ్చన్నది ప్రభుత్వ భావన.

 

రాష్ట్రంలో పేరుకుపోతున్న వ్యర్థాల పర్యవేక్షణ తరలిస్తున్న వ్యర్థాల వివరాల ప్రదర్శనకు డేటా ఆధారంగా, పారదర్శకంగా  ప్రజా నివేదికల కోసం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్క్యులారిటీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంతోపాటు ఏకీకృత ఇ-మ్యానిఫెస్ట్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది.  ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీబీ), అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్‌బీ)లు, ఆర్టీజీఎస్(

రియల్ టైమ్ గవర్నమెంట్ సొసైటీ)లను సమగ్రపరిచే రియల్-టైమ్ సర్క్యులర్-ఎకానమీ డాష్‌ బోర్డ్ ఏర్పాటు చేస్తారు. కొత్త సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియో విధానాన్ని తీసుకురావడానికి ప్రతిపాదనలను రూపొందించారు. పేరుకుపోయిన అన్ని రకాల వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకురవడంతో పర్యావరణ పునరుద్ధరణ జరుగుతుంది. 2047 నాటికి పూర్తి సర్క్యులర్ వ్వవస్థకు తీసుకెళ్లేందుకు వీలవుతుంది. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలకు అనుగుణంగా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.   పరిశ్రమలు, వాణిజ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నూతన  సర్కిల్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియోగ విధానం 4.0(2025-30)ను  ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  అయిదు సంవత్సరాల పాటు లేదా కొత్త విధానం ప్రకటించే వరకు ఇది చెల్లుబాటులో ఉంటుంది. ఈ విధానంలో రీసైక్లింగ్ కేంద్రాలను ప్రోత్సహిస్తారు.

రాష్ట్ర సర్క్యులారిటీ సెల్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ త్రైమాసికానికి ఒకసారి సమావేశమై డాష్‌బోర్డ్ఆడిట్ నివేదికలు, జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ల సమీక్షిస్తాయి. ఈ సమీక్ష ఆధారంగావిధానాలలో తాజాగా మార్పులు చేర్పులు చేస్తారు.   ప్రోత్సాహక పథకాలను, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను మెరుగుపరుస్తారు. వ్యర్థాల నిర్వహణవనరుల పునర్వినియోగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుంది. ఈ ప్రక్రియలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది.  పర్యావరణ అనుకూల విధానాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914




No comments:

Post a Comment

వ్యర్థాల పునర్వినియోగంలో అగ్రస్థానాన నిలవాలన్నదే ఏపీ లక్ష్యం

  రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తుండటంతో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.  సరైన నిర్వహణ లేకండా ఈ వ్యర్థాలను ఇలా వదిలివేస్తే,...