Apr 2, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం


రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్(అమెండ్‌మెంట్) బిల్-2026ని రాజ్యసభ గురువారం  ఆమోదించింది.  
మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఇది చారిత్రాత్మక దినం అని ఎన్డీఏ నేతలు అభివర్ణించారు. ఈ బిల్లుకు లోక్‌సభ నిన్న ఆమోదం తెలిపింది.  రాజ్యసభ ఆమోదించడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపుతారు.  పార్లమెంటులోని ఉభయసభలు ఆమోదించడంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి ఖరారైంది.  రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ విడుదలవడంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన మొత్తం 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. మిగిలిన 10 పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి.



No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...