



తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నాను. ఈ సభ్యులు మనకు తెలియడంకంటే, వారికి మనం తెలియడం విశేషం. మన ముఖ్యమంత్రి, పార్టీ పొలిబ్యూరో సభ్యులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దగ్గర నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, గుత్తికొండ ధనుంజయ రావుతోపాటు జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఇతర జాతీయ, రాష్ట్ర పదవులు స్వీకరించే గురజాల మాల్యాద్రి, బీటీ నాయుడు, డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్, పంచుమర్తి అనురాధ, తెనాలి శ్రావణ్ కుమార్, పాతర్ల రమేష్, ఆకుల జయసత్య తదితర పలువురు ముఖ్యులను నేను అనేక సార్లు కలిశాను. మాట్లాడాను. కొందరు నాకు సహాయం చేసినవారు కూడా ఉన్నారు. గుత్తికొండ ధనుంజయ రావు ఇల్లు మా ఇంటికీ సమీపంలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. మంచి మిత్రులు. పాతర్ల రమేష్ ది కూడా మా ఊరే. ముఖ్యంగా మా జర్నలిస్ట్. మేమిద్దరం దాదాపు ఒకేసారి జర్నలిజంలోకి వచ్చాం. 45 ఏళ్ల నుంచి తెలుసు. మంచి మిత్రుడు. ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారందరికీ హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు.








No comments:
Post a Comment