Oct 16, 2025

తిరుమల వివాహ కానుక


మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే, ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ  తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పోస్ట్ లో పంపాలి.  ఆ తర్వాత మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షింతలు (ఇవి పెళ్ళినాడు తలంబ్రాలలో కలపాలి), వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి, శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము. మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసుకి పంపండి. శుభలేఖ మీద ఉన్న మీ చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.


Sri Lord Venkateswara Swamy,
The Executive Officer,
T.T.D. Administrative Building,
KapilaTheertham Road,
Tirupati, Andhra Pradesh.

No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...