సచివాలయం, మే 13: ఈ
నెల 14వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల
చేశారు. సచివాలయంలోని 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ హాలులో ఈ
సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి మండలి రెవిన్యూ విభాగం,
ఆర్టీజీఎస్ లకు సంబంధించిన ఫని తుఫాను ఉపశమన కార్యక్రమాలు, పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి రాష్ట్రంలో
త్రాగునీటి పరిస్థితి, వ్యసాయం, సహకార, ఉద్యానవన, పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య,
రెవెన్యూ శాఖలకు సంబంధించి కరువు, రుతువులలో వచ్చే మార్పుల పరిస్థితులు,
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు
ఉపాధి అవకాశాలు తదితర అంశాలను సమీక్షిస్తారని వివరించారు.
No comments:
Post a Comment