సచివాలయం,
సెప్టెంబర్ 13: ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ
మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమవుతారని
ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, సలహాదారులు, శాఖాధిపతులు పాల్గొంటారని పేర్కొన్నారు.
కార్యదర్శులు అందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని,
తమ పరిధిలోని శాఖాధిపతులు కూడా హాజరవడానికి వారికి సమాచారం
అందించాలని, అలాగే సలహాదారులకు ఈ సమాచారం తెలియజేయాలని కోరారు. మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో జరిగే
సమావేశానికి అఖిలభారత సర్వీసులకు
చెందినవారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు మాత్రమే హాజరుకావాలని తెలిపారు.
మిగిలినవారందరూ గ్రౌండ్ ఫ్లోర్ లోని సాధారణ పరిపాలన
శాఖ సమావేశ మందిరంలో కూర్చోవాలన్నారు. పైన జరిగే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా
తిలకించే అవకాశాన్ని వారికి కల్పిస్తారని పేర్కొన్నారు. అవసరాన్నిబట్టి వారు ప్రధాన సమావేశ మందిరంలోకి వెళ్లే
అవకాశం ఉంటుందన్నారు. స్థలాభావం కారణంగా కార్యదర్శులు, శాఖాధిపతులు ఒక్కరే ఈ సమావేశానికి హాజరుకావాలని
శ్రీకాంత్ ఆ ప్రకటనలో కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment