Oct 6, 2019

ఏపీలో గ్రామ పాలన
            
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పాలనకు పెద్ద పీట వేసింది. గ్రామవార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు తమ గుమ్మం వద్దే పూర్తి స్థాయి సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించడంతోపాటు ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామస్వరాజ్యానికి రూపొందించిన ఈ వ్యవస్థను ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాల’ ద్వారా ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు ప్రజలకు పారదర్శికంగా అందించడానికి చర్యలు చేపట్టారు.

       సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఓ రికార్డ్ అయితే, ఇందుకోసం నిర్వహించిన పరీక్షలు కూడా మరో రికార్డ్. ఇప్పటి వరకు యూపీపీఎస్‌సీ ద్వారా 14 లక్షల మంది పరీక్షలు రాసిన రికార్డు ఉంది. హాజరు శాతం 50 వరకు ఉంది. అయితే గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షలకు దేశంలోనే తొలిసారిగా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు.  88 శాతంకు పైగా హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ సచివాలయాల్లో  పింఛన్లురేషన్ కార్డులువిద్యార్థుల ఉపకార వేతనాలుఇంటి పన్ను చెల్లింపుకులనివాస ధృవీకరణ పత్రాలతోపాటు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపు 35 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయంపశుసంవర్థకరెవెన్యూవైద్యంఉద్యానఅటవీసంక్షేమంపంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ... వంటి శాఖలకు సంబంధించిన సేవలన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయి.  ప్రభుత్వ పథకాలు, సేవలు లబ్దిదారులకు అందడాన్ని మరింత సులభతరం చేస్తారు. తొలి దశలో 1500 చోట్ల సచివాలయ భవనాలను కూడా నిర్మిస్తారు. ఇప్పటికే ఆగస్ట్ 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైంది. లక్షా 93వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక్కరి చొప్పున ఈ వలంటీర్లు సేవలందిస్తారు. కుటుంబం, ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు వారు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా ఇల్లు లేనివారికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తుంది. అలాగే ఇతర ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తారు. ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు వీరే ఇంటింటికి తిరిగి అందజేస్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు కూడా వీరే ద్వారానే అందజేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.   ప్రభుత్వానికిప్రజలకు మధ్య వారధులుగా ఈ వలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థ మొత్తం సమర్థవంతంగా పని చేసిననాడు గ్రామస్వరాజ్యం సాధించినవారమవుతాము.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
Attachments area

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...