Sep 3, 2020

యువతరం శిరమెత్తితే నవతరం గళమిప్పితే

 

యువతరం కదిలింది కదిలింది కదిలింది

నవతరం లేచింది లేచింది లేచింది

యువతరం శిరమెత్తితే నవతరం గళమిప్పితే

లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా

లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా

దురాచార బంధనాలు దొర్లిపడిన పల్లెల్లో

దోపిడి దొంగల దొడ్లై దోచే యీ పట్నాల్లో

కొత్తవెలుగు రాదా సరికొత్త బ్రతుకు రాదా

కొత్తవెలుగు రాదా సరికొత్త బ్రతుకు రాదా

||యువతరం||

కలవారి పిడికిలిలో నలుగుతున్న సిరిసంపద

కామాంధుల చేతచిక్కి కన్నీరిడు నేలతల్లి

నలుగురిదీ కాదా అది నవయుగమై రాదా

నలుగురిదీ కాదా అది నవయుగమై రాదా

||యువతరం||

విడని గొలుసు లంకెల ముడి మడత పేచీ రాజ్యాంగం

కల్లోలిత పాలనలో నలిగిపోవు ఈ దేశం

మారిపోవు తధ్యం నవమానవుడే నిత్యం

మారిపోవు తధ్యం నవమానవుడే నిత్యం

||యువతరం||

-     నార్ల చిరంజీవి

No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...