Apr 3, 2018

03.04.2018 మంగళవారం – శాసనసభ మీడియా పాయింట్



వినుకొండ MLA GV ఆంజనేయులు.
◆ AP కి జరిగిన అన్యాయాన్ని దేశంలోని అన్ని పార్టీలకు తెలియ చేసేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు.
◆ దీనితో BJP, జగన్ లకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
◆అపర చాణక్యుడు ఢిల్లీ బయలు దేరాడంటే వారికి గుబులు మొదలైంది.
◆ ధర్మ పోరాటం మొదలు పెట్టాం, విజయం TDP దే.
◆ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే రాజీనామా, దీక్షలు అంటూ జగన్ కొత్త నాటకానికి తెరదీసాడు అని ప్రజలు గమనిస్తున్నారు.
◆ కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన జగన్ ను ప్రజలు నమ్మరు.
◆ ప్రధానిని అవమానించారని విజయసాయిరెడ్డి బాధ పడుతున్నారు. అక్కడే వారి లాలూచీ అర్ధమవుతుంది.
◆ సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. ప్రధానిని విమర్శిస్తే విజయసాయిరెడ్డి కి ఎందుకు బాధ?
◆ విజయమాల్యా వద్ద చంద్రబాబు150 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు. దమ్ముంటే సాక్ష్యాలు ప్రజల ముందు ఉంచాలి.
◆ విజయసాయిరెడ్డి క్రిమినల్. అతనికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.
◆ అసత్య ఆరోపణలు ప్రజలు నమ్మరు.
◆ బీజేపీ కి వైసీపీ కి ప్రజలు బుద్ధి చెబుతారు.
---------------------------------------
MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.
◆ మహాభారతం లో 5 మంది పాండవుల తరుపున శ్రీ కృష్ణుడు రాయబారానికి వెళ్ళినట్లు, 5 కోట్ల మంది ఆంధ్రులకు న్యాయం చేయాలని అభ్యర్ధించడానికి చంద్రబాబు ఢిల్లీ(హస్తిన) వెళ్లారు.
◆ అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. BJP పరిస్థితిని అర్ధం చేసుకుని పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పై చర్చకు అంగీకరించాలి.
◆ భారతంలో చెప్పిన విధంగా ‘అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్ని ఏకము కాకపోవు’ అన్నట్లు  అన్ని పార్టీలు ఏకం అవుతాయి.
◆ మోడీ బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.
◆ విజయసాయిరెడ్డి, జగన్ లు చంద్రబాబు, లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలు అవాస్తవం, అబద్ధాల పుట్ట.
◆ రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల పై బురద చల్లడం మానుకోవాలి.
◆ సాక్షి ఫ్యాక్టరీ లో తయారైన అబద్ధపు మూటలు వాళ్ళు విప్పుతున్నారు.
----------------------------------------
అమలాపురం MLA ఐతాబత్తుల ఆనందరావు
◆ YCP వ్యవహారం చూస్తుంటే ఏమనాలో అర్ధం కావడం లేదు.
◆ ప్రత్యేక హోదా కోసం టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది.
◆ ముఖ్యమంత్రి నిజాయితీతో వ్యవహరిస్తూ ఢిల్లీ వెళ్లారు.
◆ YCP నాయకులు మోడీ జపం చేయడం, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమే.
◆ ఒక ప్రక్క మోడీ కాళ్ళు మొక్కుతూ ముఖ్యమంత్రికి సభా హక్కుల నోటీసు పంపుతారా?
◆ నోటీసు ఎందుకు అంటే, మోడీ ని అవమాన పరచినందుకు అంటున్నారు, ఆయనను అంటే ఈయనకు ఎందుకు?
◆ ఒక ప్రక్క మోడీని ఏమైనా అంటే ఒప్పుకోవు, మరో ప్రక్క రాజీనామా, దీక్ష అంటావు. ఎవరిని మోసం చేయడానికి.
◆ జగన్ పాదయాత్రలో మోడీని, అమిత్ షా ను, జైట్లీ ని విమర్శించరు. కానీ విజయసాయిరెడ్డిని మోడీ కాళ్ళమీద పడి గట్టి లాబీయింగ్ చేయమని పురమాయించాడు.
◆ తెలుగు ప్రజలకు వీరి నాటకాలు అన్నీ తెలుస్తున్నాయి.
◆ BJP చిన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది.
◆ సోనియా నిర్ణయాకి కళ్లు మూసుకుని మద్దతు ప్రకటించింది.
◆ ఆంధ్రులకు మోడీ పై కోపం ఉంటే YcP వాళ్ళు ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారు.
◆ YCP బీజేపీ తో రెండు రకాలుగా అనుబంధం కొనసాగిస్తోంది.
◆ జగన్ మోడీ ని తిట్టడు, తిడితే జైల్లో వేస్తారని భయం.
TDP తెలుగువారు హక్కుల కోసం పోరాడుతుంటే YCP BJP పక్షాన ఉన్నది.
--------------------------------------------------------
MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

★ విజయసాయి రెడ్డి మానసిక అంగ వైకల్యంతో పెట్రేగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నారు.
★ ఆర్ధిక ఉగ్రవాదిని ప్రధాని మోదీ ఎందుకు హక్కును చేర్చుకుంటున్నారు.
ఆ దన్నుతోనే విజయ సాయి మాట్లాడుతున్నారు.
★ నోట్లరద్దు ద్వారా ఎన్ని లక్షల కోట్లు నల్ల ధనం బయటకు తెచ్చారు.
★ బ్యాంక్ లపై నమ్మకం పోయి డిపాజిట్ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు.
★ డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకోవాలంటే ATM లన్నీ మూతపడ్డాయి.
★ మోడీ త్రయం బ్యాంకులని ముంచేసింది.
★ దోపిడీ దారులపై తీసుకున్న చర్యలు ఏమిటి?
★ రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు విషయంలో కాంగ్రేస్ హయాంలో ఇచ్చిన ఆర్డర్ 560 కోట్ల నుండి, 760 కోట్లకి పెరిగిందని బెంగళూరు HAL కు ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేశారు.
★ ఆ తరువాత మీరు ఫ్రాన్స్ వెళ్లి కేవలం 26 యుద్ధ విమానాలు 54000 కోట్లకు కొనుగొలు చేశారు.
★ ఆ రేట్లు బయటకు రాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు తో ఒప్పందం చేసుకున్నారు.
★ ఎన్ని కోట్ల స్కాం జరిగినది. మీ వాటా ఎంత? BJP వాటా ఎంత?
★ అక్కడ ఇంతటి అవినీతి జరిగితే రాష్ట్రంలోని BJP వారు, ఇక్కడ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.
★ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రా? లేక దేశ ప్రధానినా?
★ గుజరాత్ లో GSP అనే సంస్థను పెట్టారు. ఆ సంస్థ 20000 కోట్ల నష్టాల్లో ఉంటే, దానిని ONGC లో కలిపారు.
★ GSP డబ్బుతో పబ్బం గడుపుకొని ఎన్నికలలో ఖర్చు పెట్టారు.
★ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవసాయంలో నెగటివ్ గ్రోత్ సాధించారు.
★ అనేక పాఠశాలలో ఉపాధ్యాయులు కూడాలేరు.
★ CAG నివేదిక ప్రకారం 25000 కోట్లకు లెక్కలు లేవు.
★ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిన మోడీ ప్రధానిగా సక్సెస్ ఎలా అవుతారు.
★ అమరావతికి 1500 కోట్లు, విజయవాడ గుంటూరు కు 1000 కోట్లు ఇచ్చారు.వాటికి UC లు ఇచ్చాము. అయితే లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం లోని BJP వాళ్ళు మాట్లాడుతున్నారు.
★ కేంద్రం ఇచ్చిన మొత్తం 12,500 కోట్లు మాత్రమే, ఇందులో అవినీతి ఏమి జరుగుతుంది.
★ పోలవరం కు ఇంకా 2500 కోట్లు ఇవ్వాలి.
★ BJP రాష్ట్ర నాయకులు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు.
★ యుద్ధ విమానాలు కుంభకోణం పై వివరణ ఇచ్చి మాట్లాడండి.
★ ఆ డబ్బు మీ జేబు లోనిది కాదు, మీ తాత గాడి ముల్లె కాదు.
★ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు 11000 కోట్లకు గానూ 560 కోట్లు మాత్రమే ఇచ్చారు.
★ రాయలసీమ లాంటి వెనుకబడిన జిల్లాలకు 24,000 కోట్లకు గానూ 1050 కోట్లు మాత్రమే ఇచ్చారు.
★ BJP మతోన్మాదం తో వ్యవహరిస్తూ, అరాచకాలు సృష్టిస్తుంది.
★ ప్రధానిగా మోడీ చేసిన పనుల విషయంలో CAG ఇచ్చిన రిపోర్ట్ చూడండి.
★ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే, BJP సహకరించింది.
★ అవిశ్వాసం పై చర్చకు ఎందుకు అనుమతించరు?
★ AIADMK ను సస్పెండ్ చేసి చర్చకు అనుమతించ వచ్చు కదా.
★ మీరు పారిపోవడం సరియైన విధానం కాదు.
★ రాయలసీమ లో అభివృద్ధి, పరిశ్రమలు మీ కళ్ళకు కనిపించడం లేదా?
★ కేంద్రం ఏ ఏ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.
★ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినపుడు ఇక్కడ ఎందుకు  పెట్రోల్ ధర పెంచుకుంటూ పోతున్నారు.
★ ప్రజారాజ్యం లో నియంత లా వ్యవహరిస్తే పతనం తప్పదు.
------------------------------------------------
MLC బుద్దా వెంకన్న
■ విజయసాయిరెడ్డి కి పిచ్చి కుక్క కరచినట్లు ఉన్నది. ఆయన మాట్లాడే మాటలు, చేష్టలు అలానే ఉన్నాయి. ఆయనకు బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్ లు చేయించాలి.
■ రాష్ట్రంలో ఉండే అర్హత విజయసాయిరెడ్డి కి లేదు.
5 కోట్ల మందింప్రజాలు ఆయనను రాష్ట్ర బహిష్కరణ చేయాలి, వెలివేయాలి.
■ విజయసాయిరెడ్డి 5 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు.
■ మొన్న ప్రభుత్వ ఉద్యోగులను కించపరుస్తూ మాట్లాడినారు. నిన్న ముఖ్యమంత్రి ని అనారాని మాటలు అన్నాడు.
■ మోడీతో ప్రత్యక్ష యుద్దానికి దిగిన చంద్రబాబుపై, అసెంబ్లీ లో మోడీ వీడియో క్లిప్పింగ్స్ చూపించాడని విజయసాయి రెడ్డి సభా హక్కుల నోటీసు ఇచ్చాడు. కానీ BjP వాళ్ళు ఏమి మాట్లాడలేదు.
■ కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?
■ కేంద్రం చెప్పినట్లు తలదిఅతున్న విజయ సాయిరెడ్డి కి ముఖ్యమంత్రి ని విమర్శించే అర్హత లేదు.
■ YCP BJP వాళ్ళ డైరెక్షన్ లో నడుస్తున్నది అని నిన్నటితో తెలిసి పోయింది.
■ రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేసినట్లు, విజయసాయిరెడ్డి ని లాంటి బ్రోకర్ల ను కూడా బహిష్కరించాలి.
■ ముద్దులు పెట్టడం లో జగన్మోహన్ రెడ్డి, కాళ్ళకు మొక్కడం లో విజయసాయిరెడ్డి.
■ తెలుగువారి ఆత్మ గౌరవం PMO లో తాకట్టు పెట్టారు.
■ YCP వాళ్ళు 6 వ తారీఖున రాజీనామా చేస్తామనడం BJP ఆడిస్తున్న డ్రామా.
■ జగన్, విజయసాయిరెడ్డి లు రాష్ట్రానికి రాహుకేతువులు లా తయారయ్యారు.
---------------------------------



No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...