సచివాలయం, ఫిబ్రవరి 28: ప్రగతి
కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని
తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్
ద్వారా ప్రధానమంత్రి కౌశల్ వికాస్
యోజన(పీఎంకెవివై), ప్రధాన మంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్
రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన(పీఎంఎంవై) పథకాలను సమీక్షించారు. సచివాలయం ఒకటవ బ్లాక్
మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరం నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్
కార్పోరేషన్(ఎన్ఎస్ డీసీ) ద్వారా 75 శాతం పీఎంకెవివై నిధులు వినియోగించి యువతకు నైపుణ్య
శిక్షణ ఇప్పించినట్లు అధికారులు ప్రధానికి
వివరించారు. మొత్తం వ్యయంలో రాష్ట్రాలు 25 శాతం నిధులు భరిస్తాయని చెప్పారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల వివరాలు,
పరిశ్రమలు, ప్రైవేటు రంగ భాగస్వామ్య
గురించి తెలిపారు. 33 భాగస్వామ్య పరిశ్రమలు రూ.100 కోట్లు సహాయం అందించినట్లు
చెప్పారు. ఈ పథకం ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందినవారి వివరాలు తెలిపారు. ముద్ర పథకం ద్వారా రుణాలు తీసుకున్న,
చెల్లించినవారి వివరాలు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సాంఘీక సంక్షేమ
శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment