Dec 24, 2017

క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు


డాక్టర్ కోడెల, ఫరూక్

                సచివాలయం, డిసెంబర్: 24: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు, శాసన మండలి చైర్మన్ ఎస్ఎండీ ఫరూక్ లు వేరు వేరు ప్రకటనల్లో క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం రోజున జరుపుకునే ఈ పండుగ శాంతిని కోరుకునే పండుగ అని, మానవాళికి క్రీస్తు అందిచిన బోధనలు శాంతి సౌభాగ్యాలకు ప్రతీకలని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు చేసే ప్రత్యేక ప్రార్థనలు సకల మానవాళికి ఉపయోగపడతాయని, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్వదినం సందర్భంగా క్రిస్టియన్ సోదరులు, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని వారు ఆకాంక్షించారు.

No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...