సచివాలయం, ఆగస్ట్ 21: రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న హిందీ, ఇతర ప్రాంతీయ భాషలలో న్యాయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను ప్రచురించే
స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కేంద్ర న్యాయశాఖలోని అధికార భాషల విభాగం ప్రకటించింది. చట్టాలు, న్యాయ శాస్త్ర పుస్తకాల ప్రచురణ, ప్రామాణిక చట్టాలకు
సంబంధించిన పుస్తకాలను అనువదించడం, న్యాయ పదకోశం, న్యాయశాస్త్ర జర్నల్స్ ప్రచురణ, వివిధ రాష్ట్రాల్లో న్యాయ సంబంధంమైన అంశాలు, చట్టాలకు ప్రాచుర్యం
కల్పించడానికి ఉద్దేశించిన ప్రచురణలకు ఈ ఆర్థిక సాయం అందిస్తారు. స్వచ్ఛంద సంస్థలు దరకాస్తులు పంపడానికి చివరి తేదీ ఆగస్ట్ 31గా కేంద్ర న్యాయశాఖ అధికార భాషల విభాగం జాయింట్ సెక్రటరీ రామ్ ధన్ మీనా ఒక
ప్రకటనలో తెలిపారు. దరకాస్తు, ఈ పథకం వివరాలు శాఖ వెబ్ సైట్ WWW.lawmin.nic.in/olwing లో ఉంటాయని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు తమ బ్యాంకు ఖాతా నెంబరు, చిరునామాతో దరకాస్తులను
ఆయా రాష్ట్రాల న్యాయ శాఖ ద్వారా గానీ, జిల్లా కలెక్టర్ ద్వారా
గాని పంపించాలని ఆ ప్రకటనలో వివరించారు. అర్హత గల సంస్థలకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సహాయం అందజేస్తారని ఏపీ న్యాయశాఖ కార్యదర్శి
తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment