Sep 3, 2025

సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానం కోసం తీర్మానం

విజయవాడ: ఆగస్టు 19 నుండి 21 వరకు సీనియర్ జర్నలిస్ట్ ఫోరం కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహాసభల్లో సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తీర్మానించినట్లు ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి. జనార్ధన్,ఉపాధ్యక్షులు ఎస్. అజాద్, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావులు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో  జరిగిన విలేకర్ల సమావేశంలో కేరళలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ ఫోరం జాతీయ మహాసభలో చేసిన తీర్మానాలను, రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు. 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 రాష్ట్రాల  నుండి 250 మంది, సీనియర్ జర్నలిస్టులు ప్రథమ జాతీయ మహాసభకు విచ్చేసారని, ప్రారంభ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ముగింపు సమావేశానికి ప్రతిపక్ష నేత సతీషన్, గోవా మాజీ గవర్నర్ పిళ్ళై హాజరై మహాసభ విజయాన్ని కాంక్షించారని పేర్కొన్నారు.  ఈ సభలో ప్రధానంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో  వెటరన్స్ కు పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకు రు.20,000 తో జాతీయ పెన్షన్

విధానం ఉండాలని మహాసభ తీర్మానించినట్టు తెలిపారు. కరోనా సమయంలో ఉపసంహరించిన రైల్వే పాసులను  పునరుద్ధరించాలని మహాసభ డిమాండ్ చేయడం జరిగిందన్నారు.  దక్షిణ భారతదేశంలో ఆంధ్ర,తెలంగాణలో మాత్రమే వెటరన్స్ కు  ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగిందన్నారు.  జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను,గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్టు కుటుంబానికి వైద్యం,
ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలుకు దోహదపడాలని మహా సభ నిర్ణయించిందన్నారు.  హెల్త్ ఇన్సూరెన్స్ ను రు.5 లక్షలకు పెంచి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్స్ తరహాలో మన రాష్ట్రంలోని సిమ్స్, రిమ్స్, ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కూడా జర్నలిస్టులకు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం కల్పించాలన్నారు.

మధ్యప్రదేశ్ తరహాలో   వెటరన్స్ కు పర్మినెంట్ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలన్నారు., కర్ణాటక తరహాలో అన్ని బస్సుల్లో ( ఎసితోసహా) ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.  రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో లాగా జిల్లా స్థాయి జర్నలిస్టులకు కూడా స్టేట్ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. కేరళ మహా సభలో రాష్ట్రం నుండి. యం. వి.రామారావు, హెచ్.ఆజాద్,,యం. నరేంద్ర రెడ్డి, ఎస్.నాగార్జున రావు,, జాతీయ సమితి సభ్యులు గా, డా. టి. జనార్దన్, జాతీయ ఉపాధ్యక్షులు గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గం వారిని అభినందించింది.

సమాచార శాఖ సంచాలకులకు వినతి

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్ష్ శుక్ల ఐఏఎస్ కి, అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత కి ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేసారు. కార్యక్రమం లో ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డా. టి. జనార్దన్, గౌరవ అధ్యక్షులు నాగార్జున, ఉపాధ్యక్షులు ఎస్. అజాద్,ఎం. నరేంద్ర రెడ్డి, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

మానవ అక్రమరవాణా నిరోధించడంలో విఫలం

మానవ అక్రమ రవాణా, వ్యభిచారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మానవ అక్రమ రవాణా విషయంలో ఆడ, మగ తేడాలే...