Sep 3, 2025
ఏపీవీజేయూ గౌరవాధ్యక్షునిగా శిరందాసు నాగార్జున
విజయవాడ: ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులుగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావుని ఎంపిక చేసినట్లు యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ టి. జనార్దన్, ప్రధాన కార్యదర్శి జి. చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సిద్ధార్ధ నగర్‌లో సోమవారం జరిగిన వెటరన్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారు వివరించారు. యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మన యూనియన్ ఉపాధ్యక్షులు వెంకటరత్నం సారధ్యంలో ఈనెల 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. ఈ ప్రక్రియలో ఆయనకు అందరూ సహకరించాలని కమిటీ నిర్ణయించింది. యూనియన్ కార్యవర్గంలోకి గౌరవ అధ్యక్షులుగా శిరందాసు నాగార్జున రావు (మంగళగిరి) సహాయ కార్యదర్శులుగా పి.భుజంగ రావు (ధర్మవరం) ఆర్.రాజశేఖర్ (విజయవాడ)లను తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. జర్నలిస్టులుగా 20 ఏళ్లు పూర్తి అయి, తగిన ఆధారాలు కలిగి ఉండి, 58 ఏళ్లు నిండిన వారు, తాజాగా అక్రెడిటేషన్ కలిగినవారిని సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. సభ్యత్వ రుసుము రూ.500గా, ప్రతి ఏడాది రెన్యూవల్ కోసం రూ.100 చెల్లించాలని నిర్ణయించారు. యూనియన్‌లో 221 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, వారిలో 130 మంది మాత్రమే సభ్యత్వ రుసుం చెల్లించారు. మిగతా 91 మంది ఈనెల 15లోగా సభ్యత్వ రుసుంతో పాటు, దరఖాస్తును విజయవాడలోని మన కోశాధికారి రామారావు(7286964554)కి పంపాలని తెలిపారు. లేనిచో జాబితా నుండి పేర్లు తొలగించాలని కార్యవర్గం నిర్ణయించింది. మన సభ్యుల ప్రవర్తన గౌరవప్రదంగా హుందాగా ఉండాలని, అలా లేని పక్షంలో, ఎవరిపైనైనా ఫిర్యాదులు అందితే, వారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసేందుకు ముగ్గురితో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా ఎంవీ.రామారావు(విజయవాడ), హెచ్.ఆజాద్(అనంతపురం), వేగి రామ చంద్రరావు(విశాఖపట్నం)లుగా ఉంటారు.58 ఏళ్లు నిండి, వెటరన్ జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ కలిగిన వారు కొత్త సభ్యులుగా చేరమని కమిటీ పిలుపు ఇచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
మానవ అక్రమరవాణా నిరోధించడంలో విఫలం
మానవ అక్రమ రవాణా, వ్యభిచారం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మానవ అక్రమ రవాణా విషయంలో ఆడ, మగ తేడాలే...

-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment