మంగళగిరి: మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుజయరావు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని దామర్ల నాంచారమ్మా చెరువు ప్రాంగణంలోని భవనారుషి స్వామి వారి దేవస్థానంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేకా కృష్ణార్జున రావు మాట్లాడుతూ సాహితీ కళారంగాల అభ్యున్నతికి గుత్తికొండ ధనుంజయరావు గారు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని అన్నారు. విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబాత్తుని లక్ష్మణరావు మాట్లాడుతూ నిబద్దత, ఓర్పు, సహనంతో కూడిన వైఖరి కారణంగానే గుత్తికొండ ధనుంజయరావు గారిని తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరో పదవి వరించిందని చెప్పారు. ఈ విధంగా సామాన్య కార్యకర్తను గౌరవించడం తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని అభిప్రాయపడ్డారు. తోలుత మానవతా వేదిక కమిటీ సభ్యులు అందరూ సమూహంగా ధనుంజయరావు దంపతులను ఘనంగా సన్మానించారు. అటుపిమ్మట పురప్రముఖులు, బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానులు శాలువాళ్లతోనూ, పుష్పగుచ్చాలతోనూ ఘనంగా సత్కరించారు.
పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, దుగ్గిరాల మండల తెలుదేశం పార్టీ అధ్యక్షులు కేసంనేని శ్రీ అనిత, ధనుంజయరావు బాల్యమిత్రులు అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మంచా విజయమోహనరావు, ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు శిరందాసు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించే రీతిలో జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధనుజయరావు దంపతులు ధన్యవాదాలు తెలిపారు.


No comments:
Post a Comment