Apr 1, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం


అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఈరోజు(01.04.2026) ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్: లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో మాట్లాడారు. అమరావతి రైతులకు, మహిళలకు కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. 

ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి:  అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంది. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతి కోసం రాజధాని రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారు.

ఎంపీ అప్పలనాయుడు:   రైతుల త్యాగం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.  తండ్రికి బిడ్డతో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో, రైతుకు భూమితో కూడా అలాంటి బంధం ఉంటుంది.  సుమారు 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతుల త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.

వైసీపీ సభ్యులు వాక్‌అవుట్: అమరావతి అంశంపై లోక్ సభలో చర్చ జరుగే సమయంలో వైసీపీ సభ్యులు వాక్‌అవుట్ చేశారు. 

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఈరోజు(01.04.2026) ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. కేం...